శెనార్తి మీడియా, శంకరపట్నం:
పోలీస్ ఫ్లాగ్ డే వీక్ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ హుజురాబాద్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, కేశవపట్నం పోలీస్ సిబ్బంది ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తగట్టు మచ్చ గిరీంద్ర స్వామి ఆలయంతో పాటు కేశవపట్నంలోని మసీద్-ఏ-ఇక్బాల్ బియాబానీ మసీదు, చర్చిలో ప్రార్థనలు చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసులకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని, అమరుల త్యాగాలు పోలీస్ శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అమర పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు. అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో నివాళులర్పించడం ద్వారా మత సామరస్యం, సోదరభావం, శాంతి సందేశాన్ని చాటారు