పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌష్ ఆలం గుజ్జేటి మహేశ్ విగ్రహానికి ఘన నివాళి శెనార్తిమీడియా, గంగాధర/ రామడుగు : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్‌లోని అమరవీరుడు గుజ్జేటి మహేశ్ విగ్రహానికి సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాల మధ్య జరిగిన బలిమెల దుర్ఘటనలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన మహేశ్ సేవలను...