శెనార్తిమీడియా, కరీంనగర్:
కొత్తపల్లి పోలీసులు గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. కమాన్ పూర్ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పాడుబడ్డ ఇళ్లలో గంజాయి సేవిస్తూ, ఇతరులకు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను ఈగల్ టీం, కొత్తపల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరిలో చింతకుంట గ్రామానికి చెందిన మేకల యసాక్, ఇస్లావత్ శేఖర్, రాథోడ్ దత్తాత్రే, కరీంనగర్ రాంనగర్ కు చెందిన వేములవాడ ఆశిష్ ను పట్టుకుని వారి నుంచి 10 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఆటో, ఎలక్ట్రిక్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముఠాలో చింతకుంటకు చెందిన బషీర్ పారిపోగా మిగతా నలుగురిని పట్టుకున్నారు. కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.