15 రోజుల్లో రెండుసార్లు మోటార్‌ చోరీ

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో వ్యవసాయ మోటార్ల చోరీలు రైతులను కలవరపెడుతున్నాయి. రైతు వనపర్తి రాజేశంకు చెందిన మోటార్‌ పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీకి గురికావడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాజేశం తన పొలానికి సాగునీరు అందించేందుకు సమీపంలోని యూటీ నుంచి నీటిని తోడుకునేలా మోటార్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్‌ 16న గుర్తుతెలియని వ్యక్తులు ఆయన మోటార్‌తో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు రైతుల మోటార్లను ఎత్తుకెళ్లారు. పంటను కాపాడుకునేందుకు ఇతర రైతుల నుంచి...