జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలకు కేశవపట్నం విద్యార్థిని

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఉమ్మడి కరీంనగర్ బాలికల వాలీబాల్‌(జిల్లా అండర్‌–17) పోటీలకు కేశవపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని సయ్యద్‌ సానియా ఎంపికైంది. అక్టోబర్ 30న సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న పోటీల్లో కరీంనగర్‌ జిల్లా జట్టు తరఫున సానియా ప్రాతినిధ్యం వహించనుందని పీఈటీ రాజ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని ఎంపికపై పాఠశాల హెచ్ఎం సుభాష్‌, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్‌ రాజేంద్రప్రసాద్‌, ఉపసర్పంచ్‌ విజయకుమార్‌, సీనియర్‌ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సానియాను అభినందించారు.