శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బీజేపీ నాయకుల రాస్తారోకో.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత శెనార్తి మీడియా, శంకరపట్నం: పంటలు ఎండిపోయి, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న శంకరపట్నం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో గురువారం కేశవపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కరువు పరిస్థితులు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా? మండలంలో రైతులు సాగుకు దూరమవుతూ, పంటలు...