ఆదర్శ కుటుంబం… రివ్యూ..!
వెంకటేష్–త్రివిక్రమ్ కలయికలో సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అందులోనూ కుటుంబ కథలకు వినోదాన్ని జోడించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వస్తోందంటే అంచనాలు ఏర్పడటం సహజం. అయితే ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో ప్రచారానికి మించిన నిర్మాణపరమైన ఒడిదుడుకులు, విడుదల ఆలస్యం సినిమాపై ప్రభావం చూపించాయి. క్రైమ్ నేపథ్యానికి కుటుంబ అనుబంధాలను జోడించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? వెంకటేష్ తన నటనతో సినిమాను ఎంతవరకు నిలబెట్టారు? చూద్దాం. ఇదీ కథ.. చిట్టిబాబు (వెంకటేష్)...