అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ‘తేజస్’ ఎంపిక

శెనార్తిమీడియా, కొత్తపల్లి : కొత్తపల్లి పట్టణంలోని తేజస్​ జూనియర్​, డిఫెన్స్​ కాలేజీకి చెందిన విద్యార్థి కె.అభిషేక్ అండర్–-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కాలేజీ చైర్మన్​ సతీష్​ రావు తెలిపారు. కరీంనగర్‌ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అండర్–-19 క్రికెట్ సెలక్షన్స్​ లో అభిషేక్​ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున అభిషేక్ ఆడతారని చెప్పారు....