కోతులు అడ్డురావడంతో అదుపు తప్పిన బైక్
ఇద్దరికి గాయాలు 108లో ఆస్పత్రికి తరలింపు శెనార్తి మీడియా, శంకరపట్నం(తిమ్మాపూర్): మార్గమధ్యలో కోతులు అడ్డురావడంతో అదుపుతప్పిన ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై తాత, మనవడు గాయపడ్డారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలంపల్లి గ్రామానికి చెందిన చిప్ప బత్తుల పాపయ్య (80) తన మనవడు అనిల్ (30)తో కలిసి బ్యాంకు పని నిమిత్తం మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో మల్లాపూర్ శివారులో ఒక్కసారిగా కోతులు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాపయ్య తలకు, ఎడమ చేతి...