ఆర్టీసీ బస్సు, గ్రానైట్ లారీ ఢీకొని ఐదుగురికి గాయాలు
ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం శెనార్తిమీడియా, కరీంనగర్ : కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గ్రానైట్ బండరాయి కోసం వెళ్తున్న కంటైనర్ ను కరీంనగర్ వన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిని 108లో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులను...