SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 2:46 pm Posted by : SHENARTHI MEDIA

ఎస్జీఎఫ్​ రాష్ట్రస్థాయి డిస్కస్​ త్రో పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థి ఎంపిక

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

ఎస్జీఎఫ్​ రాష్ట్రస్థాయి డిస్కస్​ త్రో పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ స్కూల్​ స్టూడెంట్​ ఎంపికైనట్లు స్కూల్​ చైర్మన్​ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. కరీంనగర్‌ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్​ లో శుక్రవారం నిర్వహించిన డిస్కస్ త్రో పోటీల్లో పదో తరగతి చదువుతున్న యు.రిషికేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్​ చైర్మన్ ఫాతిమారెడ్డి రిషికేష్‌, అతనికి శిక్షణ అందించిన పీఈటీని అభినందించారు. అక్టోబర్ 2న హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న  జాతీయస్థాయి ఎంపిక పోటీలలో రిషికేష్ అద్భుతంగా రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.