ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి డిస్కస్ త్రో పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థి ఎంపిక
శెనార్తిమీడియా, కొత్తపల్లి : ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి డిస్కస్ త్రో పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ స్కూల్ స్టూడెంట్ ఎంపికైనట్లు స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన డిస్కస్ త్రో పోటీల్లో పదో తరగతి చదువుతున్న యు.రిషికేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ఫాతిమారెడ్డి రిషికేష్, అతనికి శిక్షణ అందించిన పీఈటీని అభినందించారు. అక్టోబర్ 2న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఎంపిక పోటీలలో...