శెనార్తిమీడియా, కొత్తపల్లి :
ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని తేజస్ జూనియర్, డిఫెన్స్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు కాలేజ్ చైర్మన్ సీహెచ్.సతీష్‌రావు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్–-19 జూనియర్ కళాశాలల క్రీడా పోటీలను ఎల్ఎండీ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో సీహెచ్.భీమేష్ జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం, హైజంప్‌లో ద్వితీయ స్థానం, జె.సాయికృష్ణ డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానం, బి.నాగరాజు షాట్ పుట్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత విజయం సాధించిన విద్యార్థులను చైర్మన్ సతీష్ రావు, డైరెక్టర్ సీహెచ్. మౌనికారావు, ప్రిన్సిపాల్ కిషన్ రెడ్డి, పీఈటీలు అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో మరింత కృషి చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి తేజస్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. క్రమశిక్షణతో కూడిన కృషి విజయానికి బాట వేస్తుందని చెప్పారు.