SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 7:50 pm Posted by : SHENARTHI MEDIA

పరిసరాల పరిశుభ్రతే పరమావధి కావాలి

వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు

శెనార్తిమీడియా, రామడుగు :

పరిసరాల పరిశుభ్రతే ప్రతి ఒక్కరి పరమావధి కావాలని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 21వ శ్రమదానాన్ని వెలిచాల పరిధిలోని గుడివెలుగులపల్లి అయ్యవారికుంట పరిసరాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది మన ఇల్లు, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదని, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత లోపించడం వల్ల ఈగలు, దోమలు, బ్యాక్టీరియా పెరిగి రోగాలు వ్యాపిస్తాయని, పరిసరాలు శుభ్రంగా ఉంటే వ్యాధులను దూరం పెట్టవచ్చన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, చెత్తను సక్రమంగా నిర్వహించడం ద్వారా భూమిని, నీటిని, గాలిని కలుషితం కాకుండా కాపాడుకోవచ్చన్నారు. చెత్తను రోడ్లపై కాకుండా కేవలం చెత్త బుట్టల్లో మాత్రమే వేయాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.