పరిసరాల పరిశుభ్రతే పరమావధి కావాలి

వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు శెనార్తిమీడియా, రామడుగు : పరిసరాల పరిశుభ్రతే ప్రతి ఒక్కరి పరమావధి కావాలని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా 21వ శ్రమదానాన్ని వెలిచాల పరిధిలోని గుడివెలుగులపల్లి అయ్యవారికుంట పరిసరాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది మన ఇల్లు, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదని, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత లోపించడం వల్ల ఈగలు, దోమలు,...