SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 8:22 pm Posted by : SHENARTHI MEDIA

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

శెనార్తిమీడియా, గంగాధర :

గంగాధర మండలం పిట్టలపల్లి వై జంక్షన్​ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 82 ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై బి.వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వెంకంపల్లికి చెందిన సంకటి మల్లయ్య తన హీరో హోండా మోటార్ సైకిల్ పై వెంకంపల్లి నుంచి మధురానగర్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్తుండగా పిట్టలపల్లి వై జంక్షన్ వద్ద వరంగల్​ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పందిర్ల జగదీశ్వర్ శర్మ తన స్విఫ్ట్ డిజైర్ కారుతో అతివేగంగా వచ్చి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సంకటి మల్లయ్య తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి కూతురు  కోమటిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.