కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
రామడుగు మండలం మోతెలో ఎండిన పంటల పరిశీలన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి శెనార్తిమీడియా, రామడుగు : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి చాడ వెంకటరెడ్డి...