SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 9:39 pm Posted by : SHENARTHI MEDIA

కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, గంగాధర :

కళ్యాణలక్ష్మితో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.30,28,509ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తహసీల్దార్ అంబటి రజిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మాజీ జడ్పీటీసీలు గునుకొండ బాబు, సత్తు కనకయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచులు పడాల భాగ్యలక్ష్మి– రాజన్న, వేముల భాస్కర్, రామిడి రాజిరెడ్డి, రేండ్ల శ్రీనివాస్, బీర్ల ఆనంద్, ఆరె తేజశ్రీ– – రాజశేఖర్, మల్కాపురం రాజేశ్వరి– రాజేశం, కడారి రేణుక– కనుకయ్య, ఈటవేని శ్రీనివాస్, కోలెపాక కవిత– మల్లేశం, దీకొండ బాబలక్ష్మి– మధు, దానె అనసూర్య– ఓదెలు, గుండవేని లావణ్య– తిరుపతి, ఎట్టెపు కనుకయ్య, గంకిడి సంధ్య– చంద్రారెడ్డి, నాయకులు సాగి అజయ్ రావు, రోమాల రమేశ్​, కర్ర బాపురెడ్డి, రాచమల్ల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, బూరుగు గంగన్న, అత్తపురం తిరుపతి, గంగాధర ప్రవీణ్ పాల్గొన్నారు.