కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, గంగాధర : కళ్యాణలక్ష్మితో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.30,28,509ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి...