కళల్లో ఒకరు.. క్రీడల్లో ఇద్దరూ.. సత్తా చాటిన కవలలు

శెనార్తిమీడియా, గంగాధర : జిల్లాస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో గంగాధర మోడల్ స్కూల్ స్టూడెంట్​ రావుల స్రాగ్వి ప్రథమ బహుమతి సాధించి తన అద్భుత ప్రతిభను చాటుకుంది. చిన్న వయస్సులోనే చిత్రలేఖనంలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌లో టీజీఎంఎస్ గంగాధర పాఠశాల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. ఈ జట్టులో చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన రావుల...