గంజాయి సరఫరా గుట్టురట్టు

శెనార్తిమీడియా, కొత్తపల్లి : గంజాయి విక్రేతలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మహమ్మద్ మున్నా, మహమ్మద్ షారుక్ కొంతకాలంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొని కరీంనగర్ తీసుకువచ్చి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విద్యార్థులు, ఇతరులకు అమ్ముతూ అక్రమార్జన చేస్తున్నారు. 15 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద రూ.20 వేలకు కిలో చొప్పున...