రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు..
రైతులకు ఎస్సై కె.శేఖర్ రెడ్డి హెచ్చరిక.. ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై కేసు శెనార్తి మీడియా, శంకరపట్నం ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులను వినియోగించడం వాహనదారుల పాలిట ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పను తప్పించబోయి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు కారణమైన అంతడుపుల పోచయ్యతో పాటు మరో వాహనదారుడు తాటిపాముల వెంకటేష్పై కేశవపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్పల్లికి చెందిన సూరం రాజన్ బాబు ద్విచక్ర వాహనంపై ఆముదాలపల్లి నుంచి మెట్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో...