జిల్లాస్థాయి సబ్‌జూనియర్ జూడో పోటీలు 6న

శెనార్తి మీడియా, కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా అమెచ్యూర్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6న (శుక్రవారం) సబ్‌జూనియర్ జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నారు. రీజనల్ స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే బాలబాలికలు ఉదయం 9 గంటల్లోపు చేరుకోవాలని నిర్వాహకులు కోరారు. 2012, 2013, 2014 సంవత్సరాల్లో జన్మించిన వారు పోటీలకు అర్హులని తెలిపారు. బాలురకు 30, 35, 40, 45, 50, 55, 60, 66 కిలోలతోపాటు 66 కిలోల పైబడిన విభాగాల్లో, బాలికలకు 28, 32, 36,...