దళారులను నమ్మి మోసపోవద్దు
నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, గంగాధర : రైతులు తమ ధాన్యం విక్రయించడానికి దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర మండలం హిమ్మత్ నగర్, కురిక్యాల, గంగాధర, లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ...