మొలంగూరు క్వారీలో కాపర్ వైర్ చోరీ.. ఆరుగురు మహిళల గుర్తింపు

రూ.60 వేల విలువైన వైర్ స్వాధీనం.. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేశవపట్నం ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి శెనార్తి మీడియా, శంకరపట్నం: మొలంగూరు గ్రామ శివారులోని జువ్వాడి సత్యనారాయణ రావుకు చెందిన క్వారీలో కాపర్ వైర్ చోరీకి పాల్పడిన ఆరుగురు మహిళలను గుర్తించినట్లు కేశవపట్నం ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై క్వారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చోరీకి గురైన సుమారు రూ.60 వేల విలువైన కాపర్ వైర్‌ను గుర్తించినట్లు...