ఎయిర్​ రైఫిల్​ షూటింగ్​ పోటీలకు ‘సెయింట్ జార్జ్’ ఎంపిక

శెనార్తిమీడియా, కొత్తపల్లి : స్వదేశ్  షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కరీంనగర్​లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్​ఐ ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎంపిక పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్​ స్టూడెంట్స్​ అండర్​ 14 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్​ చైర్మన్​ పి.ఫాతిమారెడ్డి తెలిపారు. పీప్ సెట్​లో ఎన్.సుహాక్షి, ఓపెన్ సైట్​లో ఎన్.విన్మయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొని అద్భుతమైన క్రీడా ప్రతిభతో ఈ ఘనత సాధించడం పట్ల పాఠశాల...