SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 6:46 pm Posted by : SHENARTHI MEDIA

ఎస్జీఎఫ్ అండర్‌-19 క్రీడల్లో తేజస్ విద్యార్థుల ప్రతిభ

శెనార్తిమీడియా, కొత్తపల్లి :

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్‌-19 జూనియర్ కళాశాలల ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కొత్తపల్లి పట్టణంలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కళాశాల విద్యార్థులు బాస్కెట్‌ బాల్, సాఫ్ట్​ బాల్ విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు కాలేజ్​ చైర్మన్​ సీహెచ్​.సతీష్​ రావు తెలిపారు. బాస్కెట్‌బాల్‌ లో మణిచంద్రిక, అక్షయ్, సాఫ్ట్​ బాల్​ లో మాహి అక్షిత్ తేజ, వర్షిత్ రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను తేజస్ విద్యాసంస్థల   చైర్మన్ సతీష్ రావు, డైరెక్టర్ మౌనికారావు, ప్రిన్సిపాల్ కిషన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా కాలేజ్​ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువులు, క్రీడలను సమతుల్యంగా కొనసాగిస్తూ తల్లిదండ్రులు, కళాశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ అందించిన బాస్కెట్‌బాల్ కోచ్ జీవన్, పీఈటీలను అభినందించారు.