SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 8:59 pm Posted by : SHENARTHI MEDIA

శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన

శెనార్తిమీడియా, రామడుగు :

పంటల సాగు, భూసార వృద్ధికి శాస్త్రీయ పద్ధతులపై రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని రైతులకు శాస్త్రవేత్తలకు శుక్రవారం అవగాహన కల్పించారు. బాబూ జగ్జీవన్​ రామ్​ వ్యవసాయ కళాశాల, రావే విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో వెలిచాల గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్​ ఉపేందర్ విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవాలు,  కార్యకలాపాలు, విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలను వివరించారు. కరీంనగర్ శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్​ పి.మధుకర్ రావు చేపడుతున్న రైతు సంక్షేమ, విస్తరణ కార్యక్రమాలను వివరించారు. ఎల్‌ నినో పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన పంటల మార్పిడి విధానాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలపై అవగాహనకల్పించారు. సదస్సులో భాగంగా వ్యవసాయ ప్రదర్శన ద్వారా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సాగు పద్ధతులు, నూతన వ్యవసాయ విధానాలను రైతులకు పరిచయం చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ, మెరుగైన పంటల యాజమాన్య పద్ధతులు, విత్తన శుద్ధి, సమగ్ర సస్యరక్షణ మరియు స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్​ వీర్ల నర్సింగారావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇ.రజినీకాంత్, జి.ఉషారాణి, అరుణ్ బాబు, రాజేంద్రప్రసాద్, సతీష్, అనిల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్, ఏడీఏలు, ఏవో, ఏఈవోలు, 300 మంది రైతులు పాల్గొన్నారు.