రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, రామడుగు : రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట, మోతె, రామడుగు, షానగర్, కిష్టాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ - ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి, రైతును ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా,...