ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇళ్లలో వెలుగులు

గంగాధర మండలం ఉప్పరమల్యాల, రామడుగు మండలం వెలిచాలలో ఇందిరమ్మ లబ్ధిదారులతో దీపావళి పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు : ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇళ్లలో వెలుగులు నిండాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల, రామడుగు మండలం వెలిచాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆదివారం ఆయన దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు...