SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:56 pm Posted by : SHENARTHI MEDIA

మీడియా మిత్రుల సహకారం అభినందనీయం

  • ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పాత్రికేయులు
  • ఎస్ఐ కె. శేఖర్ రెడ్డి

శెనార్తి మీడియా, శంకరపట్నం :
కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలో ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకువస్తూ పోలీస్ శాఖకు సహకరించిన మీడియా ప్రతినిధులు, పాత్రికేయుల సేవలు అభినందనీయమనిఎస్ఐ కే శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు, పోలీస్ శాఖకు మధ్య వారధిగా ఉంటూ సమాజంలో సానుకూల మార్పు కోసం పాత్రికేయులు తమ కలం ద్వారా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ పోలీస్ శాఖకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.