ఉద్యోగాల పేరిట మోసగించిన మహిళకు రెండేళ్ల జైలు శిక్ష
శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముగ్గురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన మహిళకు హుజూరాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. రాచపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి గంగ అలియాస్ గామనిక ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున గడ్డి కిరణ్, గడ్డి సంతోష్, గడ్డి మహేష్‌ల వద్ద మొత్తం రూ.3.60 లక్షలు తీసుకుని మోసం చేసింది. ఈ ఘటనపై కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 63/2016, ఐపీసీ 420 సెక్షన్...