SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:12 pm Posted by : SHENARTHI MEDIA

న్యాయ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, అడ్వకేట్ బి.కిరణ్ కుమార్

శెనార్తిమీడియా, రామడుగు :

న్యాయ విద్యార్థులు తమకు లభించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుని సమాజానికి సేవ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, అడ్వకేట్ బి.కిరణ్ కుమార్ సూచించారు. రామడుగు మండలం వెదిరలోని కిమ్స్ కాలేజ్ ఆఫ్ లాలో నూతన విద్యార్థుల కోసం గురువారం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో న్యాయ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాద వృత్తిలో న్యాయవాదుల సహకారంతో ముందుకుసాగాలని, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజల్లో న్యాయ విద్యపై అవగాహన పెంచడం, నైతిక విలువలను పాటించడం విద్యార్థుల బాధ్యత అని గుర్తుచేశారు. అనంతరం కిమ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్​ రవీందర్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ అవకాశాలను అందించడమే కిమ్స్ విద్యాసంస్థల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ డాక్టర్​ పి.నవీన్ కుమార్, లెక్చరర్స్​ వెంకటస్వామి, కాశురయ్య, కేశవ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.