న్యాయ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, అడ్వకేట్ బి.కిరణ్ కుమార్ శెనార్తిమీడియా, రామడుగు : న్యాయ విద్యార్థులు తమకు లభించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుని సమాజానికి సేవ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, అడ్వకేట్ బి.కిరణ్ కుమార్ సూచించారు. రామడుగు మండలం వెదిరలోని కిమ్స్ కాలేజ్ ఆఫ్ లాలో నూతన విద్యార్థుల కోసం గురువారం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో న్యాయ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయవాద...