హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి

శెనార్తి మీడియా, కరీంనగర్‌: ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం, అధికారాలు కల్పించాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 27న కరీంనగర్‌ సర్కస్‌ గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్‌లోని సంగీత కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దుస్స...