వాగేశ్వరిలో జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలు

150 మంది క్రీడాకారుల ప్రతిభకు పరీక్ష.. నాలుగు విభాగాల్లో పోటీలు క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ శెనార్తి మీడియా, తిమ్మాపూర్: తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) యూనివర్సిటీ స్థాయి క్రీడా ఎంపికలు విజయవంతంగా ముగిశాయి. 2026 సంవత్సరానికి పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్, కొండగట్టు, మంథని, సిరిసిల్ల...