వెలిచాలలో పిల్లల గ్రామసభ
విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సర్పంచ్ వీర్ల నర్సింగరావు శెనార్తిమీడియా, రామడుగు : జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో శనివారం పిల్లల గ్రామసభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వీర్ల నర్సింగారావు, వార్డు మెంబర్లు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన పిల్లల గ్రామసభలో విద్యార్థులు గ్రామ సమస్యలు, పాఠశాలల్లో కావల్సిన సౌకర్యాలు, మంచినీరు, రోడ్లు, పారిశుధ్యం, ఆటస్థలం వంటి అంశాలపై సర్పంచును ప్రశ్నించగా, సర్పంచ్ నర్సింగారావు ప్రతి...