ఉపసర్పంచ్ ల ఐక్యత చాటేందుకు సన్నాహాలు
17న కేశవపట్నంలో పోస్టర్ ఆవిష్కరణ శెనార్తి మీడియా, శంకరపట్నం: ఈ నెల 27న కరీంనగర్లో నిర్వహించనున్న ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యుల భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు శంకరపట్నం మండలంలో సన్నాహాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం (17న) ఉదయం 10 గంటలకు కేశవపట్నం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించనున్నట్లు కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, కేశవపట్నం ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఉపసర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులు పెద్ద...