శెనార్తిమీడియా, గంగాధర :
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాల, కళాశాలలో జరిగిన ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో గంగాధర మండలం బూరుగుపల్లి బీసీ బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తాచాటినట్లు ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ బొజ్జ తెలిపారు. అండర్ 19 వాలీబాల్ విభాగంలో మొదటి, హై జంప్ లో డి.విజయ్ రెండో బహుమతి, షాట్ పుట్ లో కె.విష్ణువర్ధన్ రెండో బహుమతి, సీహెచ్.నిరంకార్ మూడో బహుమతి, అండర్ 17 ఖోఖోలో మొదటి బహుమతి, టెన్నికాయిట్ ఎ.లక్ష్మణ్, ఎస్.విష్ణువర్ధన్ మొదటి బహుమతి సాధించినట్లు పేర్కొన్నారు. 400 మీటర్స్ రన్నింగ్ లో పి.నరేష్ మొదటి, ఎం.కృష్ణ మూడో బహుమతి, ఇ.వికాస్ చెస్ లో మొదటి బహుమతి, కబడ్డీలో రెండో బహుమతి, షార్ట్ పుట్ ఎల్.రేవంత్ రెండో బహుమతి, లాంగ్ జంప్ లో ఇ.సాత్విక్ మూడో బహుమతి సాధించారన్నారు. వీరిని కరీంనగర్ జిల్లా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలల సమన్వయకర్త అంజలి, పీఈటీ రాకేష్, టీచర్స్ అభినందించారు.
