చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

శెనార్తి మీడియా, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కొత్త పింఛన్​ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను బుధవారం పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో అనిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.