SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:01 pm Posted by : SHENARTHI MEDIA

ఎమ్మెల్యే కప్‌ పోస్టర్ విడుదల

శెనార్తి మీడియా, శంకరపట్నం:

గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్‌ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువతీ యువకులు క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ గాజుల మహేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, నాయకులు దుర్గపు తిరుపతి, హిసామొద్దీన్, సంతోష్, రమేష్, ఆరిఫ్, శ్రీకాంత్, మహేష్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.