ఎమ్మెల్యే కప్ పోస్టర్ విడుదల
శెనార్తి మీడియా, శంకరపట్నం: గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువతీ యువకులు క్రీడా పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల...