SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 8:48 pm Posted by : SHENARTHI MEDIA

ప్రజా సంక్షేమమే లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికి  చేయూత పెన్షన్ అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

శెనార్తిమీడియా, గంగాధర, రామడుగు :

ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ  చేయూత పెన్షన్ అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 897 మంది లబ్ధిదారులకు, రామడుగు మండలంలోని 23 గ్రామాలకు చెందిన 724 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడేతో కలిసి  మంగళవారం ఆయన అందజేశారు‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర మండలంలో 389 వితంతు, 26 వికలాంగ, 101 గీత కార్మిక, 75 ఒంటరి మహిళ, 126 చేనేత పెన్షన్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి  చేయూత పెన్షన్ అందజేయడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రామడుగు మండల ప్రత్యేకాధికారి బండి రాజేశ్వరి, తహసీల్దార్లు రాజమల్లు, అంబటి రజిత, ఎంపీడీవోలు రాజేశ్వరి, దమ్మని రాము, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్​, వెలిచాల తిర్మల్​రావు, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.