‘వరి’ తగ్గించి ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలి
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా రైతులకు అవగాహన శెనార్తి మీడియా, శంకరపట్నం: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని, నీటి వినియోగాన్ని తగ్గించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. తాడికల్ రైతు వేదికలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వ్యవసాయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్, మానకొండూరు ఏడీఏ శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ రైతులకు పలు సూచనలు చేశారు. నీటి...