విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటాలి
వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు స్పోర్ట్స్ యూనిఫామ్స్ అందజేత శెనార్తిమీడియా, రామడుగు : విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటాలని రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. రామడుగు మండలం వెలిచాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 68 మంది విద్యార్థులకు మంగళవారం స్పోర్ట్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటడం వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని, క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ...