SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 9:03 pm Posted by : SHENARTHI MEDIA

కేశవపట్నం ఎస్సైని సన్మానించిన టీడీపీ నాయకులు

శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌కు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నంది రెడ్డి నరేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, మానకొండూరు నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మోరే ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్సైని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోమల్ రెడ్డి, షాబీర్, కదిరే కొమురయ్య, దసరాపు సాగర్ తదితరులు పాల్గొన్నారు.