ఉప సర్పంచుల హక్కులు, గౌరవం కోసం గళమెత్తాలి

ఈ నెల 27న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో తరలిరావాలి శెనార్తి మీడియా, శంకరపట్నం: గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కరీంనగర్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, కేశవపట్నం ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయ్ కుమార్ కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లను సైతం చేర్చాలని సూచించారు. ఉప సర్పంచుల సమస్యలు, హక్కులు, గౌరవానికి సంబంధించిన...