వాగులో దిగి నిరసన
మార్చిలోపు బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇస్తామని అధికారుల హామీ శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ గ్రామస్థులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. వాగులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో...