లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
రూ.1.50 లక్షలు స్వాధీనం.. మరో వ్యక్తి అరెస్ట్ పెద్దపల్లి కోర్టులో సాక్షుల విచారణకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ శెనార్తి మీడియా, పెద్దపల్లి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ చిక్కారు. ఓ కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణ జరిగేలా చూడటంతోపాటు కేసులో నిర్దోషులుగా విడుదలయ్యేలా సహకరించేందుకు రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేటు...