విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించాలి
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, చేయూత పింఛన్ల పంపిణీ శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా అల్పాహార పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బుధవారం శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్ స్కూల్లో ఆయన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషక విలువలున్న రుచికరమైన...